News

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప‌్ర‌ధాని మోదీ పిలుపు

555views

న్యూఢిల్లీ: దేశంలో ప్ర‌తి ఇంటిపై ఆగస్టు 13, 14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు.

హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని మోదీ అన్నారు. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాక రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు.. తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా స్వీకరించడానికి దారి తీసిన అధికారిక సమాచార వివరాలను సైతం మోదీ ‌ట్విట్టర్‌లో షేర్​ చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి