
402views
న్యూఢిల్లీ: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పలువురు ముస్లింలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం స్పందించిన సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణ జరపడానికి అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయవాది ప్రశాంత్ భూషన్ పేర్కొన్న అంశాలకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టు బెంచ్‌కు సమర్పించాలని వెల్లడించింది. అయితే, మార్చిలో పిటిషన్ దాఖలు చేశామని, జాబితాను సమర్పించడానికి సమయం కోరడంతో వచ్చే వారానికి విచారణను వాయిదా వేశారు.





