News

జమ్మూక‌శ్మీర్‌లో జీ-20 సమావేశం

497views
  • మోడీ సర్కార్ నిర్ణయం

  • హాజరుకానున్న ప్రపంచ దేశాల అగ్రనేతలు

  • వ్యతిరేకిస్తున్న పాక్, చైనా

న్యూఢిల్లీ: జీ-20 దేశాల 2023 సదస్సుకు జమ్మూకశ్మీర్ వేదిక కానుంది. ఈ సదస్సు కోసం జమ్మూకశ్మీర్ పరిపాలనా విభాగం ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసిన తర్వాత అక్కడ జరగబోతున్న తొలి అంతర్జాతీయ సదస్సు ఇదే. 2019 ఆగస్టు అయిదోతేదీన‌ జమ్మూకశ్మీర్ ప్రతిపత్తిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దుచేసింది. ఈ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

జీ-20 అనేది ప్రపంచంలోనే 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 20 శాతం వరకూ ఉంటుంది. గత ఏడాది సెప్టెంబరులో జీ-20 భారత ప్రతినిధిగా(భారత షేర్పాగా) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ను మోదీ ప్రభుత్వం నియమించింది.

జమ్మూకశ్మీర్‌లో జీ-20 సదస్సు నిర్వహణను చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. దీన్ని భారత్ వ్యూహాత్మక చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, పాకిస్తాన్, చైనా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి