News

మరో తెలంగాణ విముక్తి ఉద్యమానికి బీజేపీ పిలుపు

397views

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణ ఉద్యమంలో కీలక అంశాలైన నీళ్ళు, నిధులు, నియమాలు సాధించుకోవడం కోసం మరో తెలంగాణ విముక్తి ఉద్యమం అవసరమని హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు స్పష్టం చేశాయి. తెలంగాణలోని పరిస్థితులపై ప్రత్యేకంగా విడుదల చేసిన ప్రకటనలో గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో కుటుంబం పాలనను శాశ్వతంగా కొనసాగించడానికి కఠోర ప్రయత్నం జరిగిందని ఆరోపించింది.

“ఈరోజు ముఖ్యమంత్రి కొడుకు అనుభవిస్తున్న అధికారం, ఇతర క్యాబినెట్ మంత్రుల కంటే ఎక్కువగా ఉంది. పాలన కుటుంబం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఇది స్పష్టంగా ప్రబలమైన అవినీతికి దారి తీస్తుంది”, అని పేర్కొన్నది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని తెలుపుతూ అధికార పక్షపు నాయకులు, అధికారంలో ఉన్న వారి భాగస్వాములు, వారి తోబుట్టువులు క్రూరమైన నేరాలలో పాల్గొంటున్నారని ఆరోపించింది.

ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టేందుకు పోలీసులను దుర్వినియోగం చేస్తున్నారని, ఎమ్మెల్యే పిల్లలు కీచకులుగా మారడం, సరైన నిఘా లేకపోవడంతో డ్రగ్స్ సంస్కృతి కొనసాగుతోందని విమర్శించింది. నిజానికి, లైంగిక నేరాలకు సంబంధించి బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద తెలంగాణలో అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపింది.

Source:  Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి