News

అగ్నిపథ్ అల్లర్లతో రైల్వేకు రూ. వెయ్యి కోట్ల ఆస్తి నష్టం

428views

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దాదాపు పది రోజులుగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిరసనల్లో భాగంగా రైల్వే సంస్థలపై దాడులు జరిగాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్ళు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. వీటన్నింటి వల్ల రైల్వే సంస్థకు భారీ నష్టం కలిగింది. ఇటీవల జరిగిన ఈ ఆందోళనల్లో భారతీయ రైల్వే శాఖకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి