
450views
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అదనపు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐడీఈఎస్ అధికారి ఏవీ ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే ఎనిమిదోతేదీన జారీచేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న ఇన్‌ఛార్జి ఈవో ఏవీ ధర్మారెడ్డి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ దేవస్థానాల మేనేజ్‌మెంట్ కమిటీకి నోటీసులు జారీచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.





