News

మట్టిని కాపాడుకోవటం మానవ మనుగడకు అత్యవసరం: జగ్గీ వాసుదేవ్

464views

భాగ్య‌న‌గ‌రం: మట్టిని రక్షించాలనే ఉద్యమానికి పిలుపునిచ్చి ద్విచక్రవాహనంపై యాత్ర చేపట్టిన.. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఉద్యమంలో భాగంగా ఇప్పటికే 30 వేల కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై ప్రయాణించి.. 27 దేశాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. సుమారు 560 వేడుకలు నిర్వహించి ప్రజలకు.. నేల సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. అందులో భాగంగా హైదరాబాద్ చేరుకున్న జగ్గీవాసుదేవ్‌కు గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఇషా వాలంటీర్లు ఘనస్వాగతం పలికారు.

మనుగడ పేరుతో మనిషి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నా….. మట్టిని కాపాడుకోవడం ప్రధాన కర్తవ్యంగా భావించాలని జగ్గీవాసుదేవ్ సూచించారు. పర్యటనలో 27 దేశాల సానుకూలంగా స్పందించినా.. మట్టి సంరక్షణకు అవసరమైన కార్యచరణ అమలు చేయడం లేదన్నారు. ఇందుకోసం తానే 25 మంది సభ్యులతో కూడిన కమిటీతో….. ప్రత్యేక విధి విధానాలు రూపొందించి ఆయా దేశాలకు అందించనున్నట్టు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి