News

హిజాబ్ వివాదం: 23 మంది విద్యార్థినులపై వారం సస్పెన్షన్

473views

ర్ణాటక ప్రభుత్వం ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, కోర్టులు ఎన్ని చట్టాలు చేసినా కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ వివాదాన్ని కొందరు నిరంతరం రాజేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గత వారం ఉప్పినగండి ప్రభుత్వ కాలేజీ తరగతి గదిలో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ 23 మంది విద్యార్థినులు నిరసన తెలిపారు. దీంతో కాలేజీ యాజమాన్యం వారందరినీ వారంపాటు సస్పెండ్ చేసింది. ఇస్లాంలో అసలు హిజాబ్ ప్రస్తావనే లేదని, విద్యాచట్టం ప్రకారం విద్యాసంస్థల్లో ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ నిబంధనను పాటించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.