News

ఆయా ప్రాంతాల్లో అత్య‌ధికంగా ఉన్న ముస్లింల‌ను మైనారిటీలుగా గుర్తించొద్దు

384views
  • సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

న్యూఢిల్లీ: జాతీయ మైనారిటీ కమిషన్ చట్టంలో నిబంధనను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సెక్షన్‌ 2C చట్టబద్ధతను సవాల్ చేస్తూ మ‌ధురకు చెందిన దేవ్‌కీ నందన్ థాకూర్ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మైనారిటీ అనే పదాన్ని నిర్వచించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయిలో మైనారిటీలను గుర్తించాలని మార్గదర్శకాలు జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.

1993 అక్టోబర్ 23న మైనారిటీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను అసంబద్దమైనదిగా, రాజ్యాంగంలోని 14, 15, 21, 29, 30 ఆర్టికల్స్‌కు విరుద్ధమని ప్రకటించాలని ఫిటిషనర్​ విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాల్లో మైనారీటీలుగా చెబుతున్న ముస్లింలే అత్యధికంగా ఉన్నారని వివరించారు. మరికొన్ని రాష్ట్రాల్లో హిందువులు అత్యల్ప సంఖ్యలో ఉన్నారని, పలు చోట్ల క్రైస్తవులు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పారు. అందువల్ల మైనారిటీ పదాన్ని నిర్వచించాలని పిటిషన్​లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా మైనార్టీలను గుర్తించాలని కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి