News

యూనిఫాం సివిల్ కోడ్‌కు మేం వ్యతిరేకం… మరోసారి నోరు పారేసుకున్న ఒవైసీ

514views

భాగ్య‌న‌గ‌రం: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు తమ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి నోరు పారేసుకున్నారు. అసదుద్దీన్ ఒవైసీ జైపూర్‌లో రాజస్థాన్ పార్టీ యూనిట్‌ను ప్రారంభించారు.

‘‘భారతదేశం భిన్నత్వానికి ప్రసిద్ధి. ఆ వైవిధ్యాన్ని మనం నిలుపుకోవాలి. ఏఐఎంఐఎం యూనిఫాం సివిల్ కోడ్ విధింపునకు అనుకూలం కాదు. గోవా వంటి అనేక చోట్ల హిందువుల కోసం నిబంధనలు రూపొందించారు… బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం ఆ నిబంధనలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని ఒవైసీ ప్రశ్నించారు. 2023లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ భావిస్తోందని ఒవైసీ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి