News

ఆలయాలను అర్చకులకు అప్పగిస్తాం… భూములు మాత్రం బొక్కేస్తాం…

457views
  • ఆంధ్రప్రదేశ్ దేవాదాయ వింత పోకడలు

అమ‌రావ‌తి: హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అయిదు లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను అక్కడి అర్చకులకు అప్పగించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ ఆలయాల పరిధిలో రెండు లక్షల ఎకరాల వరకు ఉన్నాయని చెప్పారు. వాటిపై అధికారం మాత్రం ప్రభుత్వానిదేనని… కౌలు వేలం నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలో ఉంటుందని వ్యాఖ్యనించారు. అయితే, దీనిపై స్పష్టత తీసుకోవాల్సి ఉందన్నారు. అవసరమైతే న్యాయస్థానంలో అప్పీలుకు వెళ్తామని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి