News

అణు సామర్ధ్యాన్ని విస్తరిస్తున్న పాకిస్తాన్: అమెరికా

389views

న్యూఢిల్లీ: అణుసామర్థ్య విస్తరణ, ఆధునీకరణను పాకిస్తాన్‌ 2022లో కూడా కొనసాగిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారి స్కాట్‌ బెరియర్‌ అభిప్రాయపడ్డారు. భారత అణుసంపత్తిని, ఆధిక్యతను తట్టుకొని మనుగడ సాగించేందుకు పాక్‌ అణువిస్తరణ చర్యలను సమర్థించుకుంటుందన్నారు. భారత్‌తో ఉద్రిక్తతలు పాక్‌ రక్షణ విధానాలను నిర్దేశిస్తాయని తన నివేదికలో స్కాట్‌ చెప్పారు. అయితే, 2021 తర్వాత సరిహద్దు వద్ద హింసాత్మక ఘటనలు తగ్గినట్టు తెలిపారు. పాకిస్తాన్ దీర్ఘకాలిక దౌత్య పరిష్కారం వైపు దృష్టి సారించడంలేదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి