News

రూ.25 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం: ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు

482views

చెన్నై: ప్రాచీన మరకత పచ్చశిలతో తయారైన.. సుమారు రూ.25 కోట్ల విలువైన శివలింగాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇరువురిని చెన్నైలోని పూందమల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు చెన్నై వెల్లవేడు పుదుకాలనీకి చెందిన భక్తవత్సలం అలియాస్‌ బాలా(46), పుదసత్తిరం కూడంబాక్కం కలెక్టర్‌ నగర్‌కు చెందిన భాగ్యరాజ్‌(42)గా గుర్తించారు. లోహపు నాగాభరణంతో కూడిన ఈ మరకతపచ్చ శిల శివలింగం సుమారు పది కిలోల బరువున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిలోని గరుడాళ్వార్‌ రూపాన్నిబట్టి ఆ విగ్రహం నేపాల్‌కు చెందినదని, ఐదువందల సంవత్సరాలనాటిదని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి