News

మదర్సాల్లో జాతీయ గీతాలాపన చేస్తే తప్పేంటి? కేంద్ర మంత్రి సాద్వీ నిరంజన్ సూటిప్ర‌శ్న‌

564views

ల‌క్నో: యూపీలోని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేసిన తర్వాత సమస్య ఏమిటని కేంద్రమంత్రి సాద్వీ నిరంజన్‌ ప్రశ్నించారు. అన్ని మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ యూపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘స్వాతంత్య్ర పోరాటంలో జాతీయ గీతం, వందేమాతరం ఆలపించి ప్రజలు తమ ప్రాణాలను అర్పించారు. కాబట్టి ఈ రోజు జాతీయ గీతం పాడటానికి ఎందుకు ఇబ్బంది? ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నిరంజన్ చెప్పారు. సాద్వి ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు కాన్పూరుకు వచ్చారు.

మార్చి 24న జరిగిన యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, యూపీ మైనారిటీ రాష్ట్ర మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. వారణాసి కోర్టు ఆదేశించిన కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్‌వాపి మసీదు సముదాయం సర్వే గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ,‘‘ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించకపోతే, వారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?’’ అని మంత్రి ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి