
416views
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీరామ అలంకరణలో చిన వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం హనుమద్ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. రాత్రి ఎదుర్కోలు, అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారి తిరువీధిసేవ నిర్వహించనున్నారు.
స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జిల్లాలోని రాపూరు మండలంలో పెంచలకోన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామి వారికి సింహ వాహన సేవ నిర్వహించారు. రాత్రి ప్రధాన ఘట్టమైన (నృసింహుని జయంతి) బంగారు గరుడ వాహనంపై భక్తులకు శ్రీపెనుశిల లక్ష్మీనృసింహస్వామి దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవార్లకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.





