
384views
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని మొహాలీలో సోమవారం జరిగిన రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్.పి.జి) దాడి కేసులో పోలీసులు శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశారు. పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన ఈ దాడి వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ హస్తం ఉన్నట్టు వెల్లడైంది.
ఐఎస్ఐ ఆదేశాలతో ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ), స్థానిక గ్యాంగ్‌స్టర్స్ ఈ దాడికి పాల్పడినట్టు బయటపడింది. పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వీకే భవ్రా విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కెనడా నివాసి లక్బిర్ సింగ్ లండా ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని తెలిపారు. పాకిస్తాన్‌లోని ఖలిస్థాన్ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండాకు లక్బిర్ సన్నిహిత సహచరుడని తెలిపారు.





