
47views
శ్రీలంక నూతన ప్రధాని విక్రమసింఘే
కొలంబో: శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని భారత్ స్వాగతించింది. శ్రీలంకకు భారత్ సాయం ఎప్పుడూ ఉంటుందని భారత హైకమిషన్ పేర్కొన్నది. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ.. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు.
తన పదవీకాలంలో భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురు చూస్తున్నానని, అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్ ఆర్థిక సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు వివిధ రూపంలో భారతదేశం మూడు బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని అందించింది.