News

మసీదులకు అక్రమంగా అమర్చిన లౌడ్ స్పీకర్లు తొలగించాలి

651views

ల‌క్నో: మసీదుల్లో అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన లౌడ్‌స్పీకర్‌లు, మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ లిమిట్ నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తొలగించేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ హోం శాఖ పోలీసులను ఆదేశించింది.

ఏప్రిల్ 30వతేదీలోగా అన్ని స్థలాల జాబితాను తయారు చేసి హోం శాఖకు పంపాలని పోలీసు స్టేషన్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లా నుంచి డివిజనల్ కమిషనర్లు నివేదికలను పంపుతారు. మత పెద్దలతో చర్చించిన తర్వాత అన్ని అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనుమతితో మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించవచ్చని, అయితే, ప్రాంగణం నుంచి శబ్దం బయటకు రాకూడదని ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి