News

రామ్​ మందిర్​ ట్రస్ట్​ చీఫ్​ ఆరోగ్యం విషమం

678views

అయోధ్య: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ అధ్యక్షుడు మహంత్​ నిత్య గోపాల్​ దాస్​ అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆయనను లఖ్​నవూలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ముత్రపిండాల సమస్య తలెత్తడం వల్ల ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయనను మేదంతా ఆసుపత్రిలో చేర్చారు.

గోపాల్​ దాస్​ ఆరోగ్యస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారని.. చికిత్సను కొనసాగిస్తున్న‌ట్టు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. రామమందిర్​ను నిర్మిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ్​క్షేత్రకు దాస్​ ఛైర్మన్​గా వ్యవహరిస్తున్నారు. దాస్​ ఇదివరకు కూడా పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 2020 నవంబరులో శ్వాసకోస సమస్య కారణంగా ఆయన ప్రస్తుతం చేరిన మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. 2021 అక్టోబరులో కూడా కొవిడ్​ సోకిన కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి