
689views
చెన్నై: పరిపక్వత లేనివారే ప్రధాని మోడీని విమర్శిస్తారని ప్రముఖ దర్శకుడు భారతీరాజా అన్నారు. చెన్నై, త్యాగరాయనగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(ఏప్రిల్ 20) ‘ప్రధానమంత్రి ప్రజా సంక్షేమ పథకాలు- నవ భారత్’ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన తమిళ డైరెక్టర్ భాగ్యరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆష్కరణ కార్యక్రమానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై, విశ్రాంత ఐఏఎస్ అధికారి సెల్వరాజ్, నటుడు శివాజీ గణేశన్ కుమారుడు, నిర్మాత రామ్‌కుమార్ హాజరయ్యారు. వారికి పుస్తకం కాపీలను అందించారు.





