News

ఏడాది చివరకు జమ్మూలో శ్రీవారి ఆలయ పనులను పూర్తి చేయాలి

344views

జమ్మూ: జమ్మూ సమీపంలోని మాజిన్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు పనుల పురోగతిని చైర్మన్ కు వివరించారు.

ఆలయ నిర్మాణానికి ఉపయోగించాల్సిన వాటిలో ఏపీలోని కోటప్పకొండలో తయారు చేస్తున్న రాతి స్తంభాలు తదితరాలు అందాల్సి ఉందని, మరికొన్ని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పనులు ఈ ఏడాదిలోగా పూర్తి చేసేందుకు తగిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని కార్యాచరణ అమలు చేయాలని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి