News

నాకు రాముడు తెలియ‌దు: టీఎన్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి

534views
  • టైమ్స్ నౌతో మాట్లాడుతూ హిందూ మనోభావాలను కించపరిచిన ప్ర‌జాప్ర‌తినిధి

చెన్నై: రాహుల్ గాంధీ బ్రేకింగ్ ఇండియా ఎజెండాను ముందుకు తెచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి హిందూ మనోభావాలను కించపరిచారు. టైమ్స్ నౌతో మాట్లాడిన ఎంపీ.. తమిళనాడు (టీఎన్)లో ఎవరూ ప్రభు శ్రీరాముడిని పూజించకూడదని పట్టుబట్టారు. రాష్ట్ర ప్రజలు పూర్వీకుల ఆరాధనను విశ్వసిస్తున్నారని ఆమె పేర్కొంది.

“నాకు రాముడు తెలియదు, ఎందుకంటే మేం ఆదివాసీలం.. మేము మా పూర్వీకుల ఆరాధనను అనుసరిస్తాము. తమిళనాడులో ఎవరినైనా అడగండి. తమిళనాడులో మీకు రామ మందిరం కనిపించదు. ప్రతి వారం నేను మా వంశం వెళ్లే గుడికి వెళతాను, అది పితృపూజ అని ఎంపీ చెప్పారు. ఆ తర్వాత ఆమె దక్షిణ భారతీయులు, ఈశాన్య, ఓబీసీ, ‘దళితులు’, హిందూ సమాజంలో భాగం కాదని తన అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేసింది.

 

టీఎన్‌లో తన మిత్రపక్షమైన డీఎంకే(ద్రావిడ మున్నేట్ర కజగం)పై ఎక్కువగా ఆధారపడుతున్న కాంగ్రెస్, ప్రభు శ్రీరామ్ ఉనికి గురించి పదే పదే ప్రశ్నలను లేవనెత్తింది. కాబట్టి, జ్యోతిమ‌ణి ఇలాంటి ప్రకటనలు చేయడంలో ఆశ్చర్యం లేద‌ని రాజ‌కీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభు శ్రీరామ్ ఉనికిని ప్రశ్నించడంతోపాటు అనేక ఇతర హిందూ వ్యతిరేక వ్యాఖ్యలతో సహా అనేక నిరాధారమైన వాదనలు చేశారు. రామజన్మభూమి తీర్పు హిందువులకు అనుకూలంగా వచ్చిన తర్వాత కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు కూడా వేళ్ళు ఎత్తడం గమనార్హం.

కాగా, ఎంపీ జ్యోతిమ‌ణి మ‌రోసారి పాఠాలు చ‌ద‌వ‌డం అవ‌స‌ర‌మ‌ని, టీఎన్‌లో అనేక శ్రీ‌రాముని కోవిళ్ళు ఉన్నాయ‌ని, దీనిని దేవాలయాల భూమి అని పిలుస్తారని హ‌నుమ భ‌క్తులు హిత‌వు ప‌లికారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి