
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో దారుణ ఘటన బయటకు వచ్చింది. గిరిజన బాలికను సొంత తండ్రే అమ్మేశాడు. ఈ తర్వాత బాలికపై టీఎంసీ నాయకుడు, అతని సహచరులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బోల్పూర్‌లోని సియాన్ ములుక్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈ కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ సభ్యుడు దీప్తిమాన్ ఘోష్, బాధితురాలి తండ్రి సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, బాధితురాలి తండ్రి టీఎంసీ నాయకుడి నుండి 1 లక్ష రూపాయలకు పైగా అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక ఈ ఏడాది మార్చి 31న కుమార్తెను ఘోష్‌కు అప్పగించాడు. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన నిందితులు, అతని సహచరులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.
టీవీ9 బంగ్లా నివేదిక ప్రకారం, బాలికపై మొదట మార్చి 31 న స్థానిక యువకులు అత్యాచారం చేశారు. వారు సైలెంట్ గా ఉండాలని బాధితురాలిని భయపెట్టారు. ఆనందబజార్ పత్రిక ప్రకారం… స్థానిక యువకుల్లో టీఎంసీ నాయకుడు దీప్తిమాన్ ఘోష్ కూడా ఉన్నట్టు అని తేలింది. బాలిక బుర్ద్వామన్‌లోని తన అత్త ఇంటికి వెళ్ళి చికిత్స తీసుకుంది. అవమానాలకు భయపడి బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది.
బోల్పూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత, ఆమెపై మళ్ళీ టీఎంసీ నాయకుడు, మరో ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. టీవీ9 బంగ్లా, ఆనందబజార్ పత్రిక రెండూ కూడా ఈ దారుణంలో బాలిక తండ్రి ప్రమేయం ఉన్నట్టు నివేదించాయి. బాధితురాలు తన సోదరికి తనపై జరిగిన దారుణాన్ని వివరించి, బోల్పూర్ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చింది.





