
602views
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ దుకాణదారుడు తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసులో భాగంగా నిందితులను విచారిస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని బరేలీ(రూరల్) ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి నినాదాలు వినిపించడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది యూపీలోని నోయిడాలో ఓ మతపరమైన ఊరేగింపులో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు చేసినందుకు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.





