News

మంత్రిగారొస్తున్నారని… శ్రీకాళహస్తి ఆలయ అధికారుల ఓవ‌ర్ యాక్ష‌న్‌!

477views
  • గంటల పాటు క్యూలైన్లలోనే భక్తుల నిలిపివేత

  • ఆగ్రహంతో మినిస్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు

శ్రీ‌కాళ‌హ‌స్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శనానికి వచ్చిన దేవాదాయశాఖ మంత్రి సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. సత్యనారాయణ మొదటిసారి మంత్రి హోదాలో ఆలయానికి వస్తుండటంతో అరగంట ముందునుంటే భక్తులను క్యూలైన్లలో నిలిపేశారు అధికారులు. దీంతో ఆగ్రహించిన భక్తులు.. మంత్రి ఆలయంలోకి రాగానే “డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.

ఎలాంటి సౌకర్యాలూ కల్పించకుండా క్యూలైన్లలో నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవారిని దర్శించుకున్న మంత్రికి ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. కరోనా తగ్గుముఖం పట్టడం, సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి