News

అనకాపల్లిలో జాతరకు విద్యుత్ సరఫరా నిలిపివేత‌!

693views

అన‌కాప‌ల్లి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి జాతరలో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ళ‌కొక‌సారి జాతర దృష్ట్యా నాలుగు కూడళ్ళ‌ల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

రాత్రంతా అమ్మవారి ఊరేగింపు, జాగరణ ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే, పోలీసులు మాత్రం.. అనుమతించిన సమయం దాటిపోయిందని సాంస్కృతిక కార్యక్రమాల వేదికల వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. పరిసర గ్రామాల్లో అర్ధరాత్రి రెండు గంట‌ల‌ వరకు అనుమతించారని.. తమపై మాత్రం ఆంక్షలు ఏమిటని నిలదీశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి