News

నెత్తురోడిన అమెరికా.. తీవ్రవాద చర్యేనా..?

497views

న్యూయార్క్: న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో 16 మంది గాయపడ్డారు. వీరిలో అయిదుగురికి తుపాకీ గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సన్‌సెట్ పార్క్‌లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 గంటలకు తుపాకీ పేలుళ్ళు సంభవించాయి. కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.

నారింజ రంగు టీషర్టు వేసుకున్న ఆ వ్యక్తి మాస్కు కూడా ధరించినట్టు చెబుతున్నారు. ప్లాట్‌ఫారమ్ మీద నుంచి కాల్పులు జరిపాడని, ట్రైన్‌లోకి పొగ బాంబును విసిరేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. న్యూయార్క్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం రాగానే అక్కడికి చేరుకున్నారు. మొదట స్టేషన్లో పొగలు కమ్ముకున్నాయని సమాచారం అందిందని ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఆ తరువాత కొంతమంది బులెట్ గాయాలతో అక్కడ పడి ఉండడాన్ని అధికారులు చూశారు. ముష్కరుడు 33 సార్లు కాల్పులు జరిపాడని ఎన్‌. వై.పి.డి చీఫ్ జేమ్స్ ఎస్సిగ్ తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి