News

పోలీసుల అదుపులో నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్

585views

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి విదేశాలకు పరారైన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్(49)ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నీరవ్ మోదీ రూ.13,578 కోట్ల మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే..! ఈ కుంభకోణం దర్యాప్తులో భాగంగా పరబ్ సుభాష్ శంకర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం మంగళవారం ఉదయం తిరిగి ముంబైకి రప్పించింది.

“సుభాష్ శంకర్ కైరోలో ఉండగా.. చట్టపరమైన ప్రక్రియల తర్వాత భారతదేశానికి తీసుకువచ్చారని సీబీఐ అధికారి తెలిపారు. అతనిని తీసుకురావడానికి ఒక సీబీఐ బృందం వెళ్ళింది. మంగళవారం ఉదయం శంకర్‌తో కలిసి ముంబైకి చేరుకుంది.” అని ఓ అధికారి తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి