
ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక చర్య ప్రపంచ దేశాలను కమ్మేస్తోంది. యుద్ధంతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం, సప్లై చైన్ ఇక్కట్లలో పడటంతో పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇందులో ఈజిప్టు కూడా చేరింది. ప్రపంచంలో గోధుమలు అధికంగా పండించే దేశాలలో భారత్ ఒకటి. దీంతో తమ ఆహార ధాన్యాల అవసరాల కోసం ఇండియాపై ఆధారపడక తప్పని పరిస్థితి ఈజిప్టుకు నెలకొంది. దీంతో ఇటీవల దుబాయ్ లో జరిగిన సమావేశంలో మన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ తో ఈజిప్టు ప్లానింగ్ శాఖ మంత్రి హలా ఎల్సైడ్ చర్చించారు.
తమ దేశ అవసరాలకు సరిపడే విధంగా కోటి 20 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేయాలంటూ ఈజిప్టు భారత్ ని కోరింది. భారీ ఎత్తున జరిగే గోధుమల వాణిజ్యానికి తగ్గట్టుగా లాజిస్టిక్స్, సప్లై చెయిన్ వంటి కీలక అంశాలపై ఇరువైపులా అధికారులు కసరత్తు చేస్తున్నారు.





