News

ఏపీలో ఆల‌యాల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి

550views
  • హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో భ‌క్తుల ధ‌ర్నా

ప్ర‌కాశం(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌): హిందూ దేవాల‌యాల ఆస్తుల‌ను అన్య‌మ‌త‌స్తులు ఆక్ర‌మించుకుంటున్నార‌ని, త‌క్ష‌ణం అధికారులు స్పందించి ఆ ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప‌లువురు భ‌క్తులు ఆందోళ‌న చేశారు. ఈ మేర‌కు హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో సింగ‌రాయ‌కొండ ఎమ్మార్వో ఆఫీసు వ‌ద్ద భ‌క్తులు సోమ‌వారం ధ‌ర్నా చేశారు.

ఒక్క ప్రకాశం జిల్లాలో పదహారు వందల ఎకరాల దేవాదాయ‌, ధ‌ర్మాదాయ భూమిలో సుమారు 35 చ‌ర్చ‌లు పుట్టాయ‌ని ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు తెలిపారు. ఇవ‌న్నీ ఆల‌యాల భూమిలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ని తేల్చిచెప్పారు.

త‌క్ష‌ణం వీటిని తొల‌గించాల‌ని లేనిపక్షంలో ఆందోళ‌న ఉద్ధృతం చేస్తామ‌ని భ‌క్తులు హెచ్చ‌రించారు. దీంతో అధికారులు స్పందించారు. ఎమ్మార్వో మాట్లాడుతూ న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈవోను పిలిపించి, అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొల‌గించివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లోపు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని ఎమ్మార్వో భ‌క్తుల‌కు హామీ ఇచ్చారు.

హిందూ ధ‌ర్మంపై చైత‌న్యం

సింగ‌రాయ‌కొండ మండలం సోమరాజు పల్లె గ్రామంలో ఈ నెల 27న రాత్రి పూజ్య స్వామీజీలు, హిందూ ధర్మ రక్ష సమితి పెద్దలు హిందూ ధర్మంపై గ్రామస్తులకు చైత‌న్య‌ప‌రిచారు. హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం వివ‌రించారు.

స్వార్థ‌ప‌రుల వ‌ల్ల హిందూ ధ‌ర్మానికి ఉన్న హానిని తెలిపారు. అన్యమతస్థులు హిందూ సంస్కృతిపై ఏ విధంగా దాడి చేస్తున్నారు? మ‌నం ఏ విధంగా వాటిని అడ్డుకోవాల‌ని వంటి విష‌యాల‌ను పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల‌కు చెందిన భ‌క్తులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి