
553views
-
బోర్డుతో చర్చించిన జమ్మూకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్
జమ్మూకశ్మీర్: అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రపై కీలక ప్రకటన చేసింది. జూన్ 30వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్రను ప్రారంభించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను జూన్ 30న ప్రారంభించి, సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈసారి 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునే అవకాశం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
కరోనా తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గని నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా కారణంగా గత రెండేళ్ళుగా భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. దీంతో ఈ ఏడాది భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నట్టు బోర్డు సభ్యులు చెబుతున్నారు.





