News

బీర్భూమ్ హింస కేసు.. రాంపూర్‌హ‌ట్‌లో అడుగుపెట్టిన సీబీఐ బృందం

640views

బీర్భూమ్(పశ్చిమ బెంగాల్): బీర్భూమ్ హింసాకాండ కేసును స్వాధీనం చేసుకోవాలని కోల్‌క‌తా హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని ఆదేశించిన తరువాత, సెంట్రల్ ఏజెన్సీకి చెందిన 15 మంది సభ్యుల బృందం కేసు విచారణకు శనివారం రాంపూర్‌హాట్‌లోని నేరస్థలానికి చేరుకుంది.

ఈ బృందానికి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిఐజి) అఖిలేష్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(సిఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణులు కూడా ఉన్నారు.

ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) మనోజ్ మాల్వియా శుక్రవారం తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హట్ ప్రాంతంలో మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు బదు షేక్ హత్య తర్వాత ఒక గుంపు ఇళ్లకు నిప్పుపెట్టడంతో మొత్తం ఎనిమిది మంది సజీవదహనమైన విష‌యం విదిత‌మే.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి