News

విద్యా వ్య‌వ‌స్థ‌లోని ‘క‌రోనా న‌ష్టాన్ని’ భ‌ర్తీ చేద్దాం

619views
  • ఆర్‌.ఎస్‌.ఎస్ స‌హ స‌ర్ కార్య‌వాహ డాక్ట‌ర్ కృష్ణ గోపాల్‌

రాంచీ: క‌రోనా ర‌క్క‌సి వ‌ల్ల విద్యా వ్య‌వ‌స్థ‌లో ఏర్ప‌డిన న‌ష్టాన్ని మ‌న‌మంతా ఐక్యంగా భ‌ర్తీ చేద్దామ‌ని రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) సహ స‌ర్ కార్య‌వాహ డాక్టర్ కృష్ణ గోపాల్ అన్నారు. ఈ ప్రపంచ విపత్తు కారణంగా పాఠశాల, విద్యార్థుల కార్యకలాపాలు నిర్వీర్యమయ్యాయని, అన్నదమ్ములు బడికి వెళ్ళ‌డం మానేశార‌ని, ఈ పరిస్థితిలో పాఠశాల‌ల్లో విద్యా జ్యోతులు వెలిగేలా స‌మిష్టిగా కృషి చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌న్నారు. ఇదే మ‌న ల‌క్ష్యం కూడా అని పేర్కొన్నారు.

కుడ్లంలోని శ్రీ కృష్ణచంద్ర గాంధీ ఎడ్యుకేషనల్ నగర్‌లో శుక్ర‌వారం జ‌రిగిన విద్యాభారతి ఆల్ ఇండియా జనరల్ అసెంబ్లీ ప్రారంభ సెషన్‌లో కృష్ణ గోపాల్ ప్రసంగించారు. కరోనా కాలం కారణంగా విద్యార్థులు, పాఠశాలలు, ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని భ‌ర్తీ చేసేందుకు మ‌న‌మందరం చేయూత‌నిద్దామ‌ని పిలుపునిచ్చారు. సామాజిక, మానసిక, మేధస్సు పరంగా పిల్లలకు జరిగే నష్టాన్ని సామాజికత ఆధారంగా మాత్రమే పూర్తి చేయవచ్చ‌ని, ఇందుకోసం పాఠశాల య‌జ‌మాన్యాల‌తోపాటు కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక శ్ర‌ద్ధ‌చూపించాల్సి ఉంద‌న్నారు.

పిల్లలకు సామాజిక జీవితం గురించి అవగాహన కల్పించాల‌ని, వివిధ రకాల పోటీలను వారి దినచర్యలో చేర్చాల‌ని కృష్ణ గోపాల్‌ కోరారు. పిల్లలు పోటీల్లో పాల్గొనడం ద్వారానే వారిలో శారీరక, మేధో, మానసిక సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యాభారతి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీ రామ్ ఆరావ్కర్, త‌దిత‌రులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశారు.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి