News

‘హ్యాండ్‌బాల్‌’లో మెరిసిన‌ భారత అమ్మాయిలు

426views

న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. కజకిస్థాన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా అవతరించింది.

సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 41-18 తేడాతో థాయిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆరంభం నుంచే భారత అమ్మాయిలు దూకుడుగా ఆడారు. ప్రథమార్థంలో భారత్ 20-9 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో కూడా అదే జోరును కొనసాగించింది. ఎటాకింగ్ గేమ్‌తో థాయిలాండ్‌కు కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.

చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ భారత్ అలవోక విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. భావన శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. ఇక చేతన శర్మ ఉత్తమ గోల్‌కీపర్‌గా ఎంపికైంది. ఈ విజయంతో భారత్ ప్రపంచ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి