
372views
-
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: హోలీ పండుగ ఈసారి మార్చి 10నే వచ్చేస్తుందని తాము చెప్పినట్టే జరిగిందని, ముందుగానే సంబరాలు చేసుకొంటున్నామని చెబుతూ ఇది ఎన్డీయే కార్యకర్తల ‘విక్టరీ 4’ (నాలుగు రాష్ట్రాల విజయం) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. హిమాలయాల (ఉత్తరాఖండ్) నుంచి సముద్రం (గోవా) వరకూ నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని తెలిపారు.
ఇది భారత ప్రజాస్వామ్య పండుగ అని నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
Source: Nijamtoday





