News

ఎస్సీ మేయ‌ర్‌ స్థానాన్ని కొట్టేసిన క్రిస్టియ‌న్‌!

712views

చెన్నై: సనాతన దళితుల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన రిజర్వేషన్‌లను రాజ‌కీయ ప‌లుకుబ‌డి క‌లిగిన అక్ర‌మార్కులు ద‌ర్జాగా అనుభ‌విస్తున్నారు. హిందువుగా ఉండి, ఆ త‌ర్వాత క్రైస్తవ మతంలోకి మారినవారు ఇంకా హిందూ పేర్లను ఉంచుకుంటూ నిజ‌మైన ద‌ళితులను మోసం చేస్తున్నారు. చెన్నై కార్పొరేష‌న్ మేయర్ పదవిని ఎస్సీల‌కు కేటాయించారు. అయితే, క్రైస్త‌వం పుచ్చుకున్న‌ ఆర్.ప్రియ ఇంకా హిందూ పేరును, కులాన్ని వీడ‌లేదు. ఆమె మేయ‌ర్‌గా ఎన్నిక‌యింది. దీంతో నిజమైన ఎస్సీల్లో ఆందోళ‌న‌, ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదంతా ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వం పాల‌న‌లోనే జ‌రుగుతున్నాయ‌ని హిందూ సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి