News

భార‌త్ మిసైల్ దాడి… పాకిస్తాన్ ఆరోప‌ణ‌!

632views

న్యూఢిల్లీ: త‌మ మీద‌కు భార‌త్ మిసైల్ దాడి చేసింద‌ని, పాకిస్తాన్ ఆరోపించింది. భారతదేశానికి చెందిన సూపర్‌సోనిక్ క్షిపణి పాకిస్తాన్ మీదకు వచ్చిందని, బుధవారం సాయంత్రం సిర్సా నుంచి టేకాఫ్ అయ్యిందని ఆరోపించింది. పాకిస్తాన్ భూభాగంలోని 124 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశంలో బుధవారం సాయంత్రం అది ల్యాండ్ అయిందని పాకిస్తాన్ అధికారులు గురువారం పేర్కొంది. ఈ క్షిపణి 40,000 అడుగుల ఎత్తులో దూసుకువచ్చిందని.. ఇలాంటి మిసైల్స్ ద్వారా భారత, పాకిస్తాన్ దేశాల గగనతలంలో ప్రయాణికుల విమానాలు, భూమిపై ఉన్న పౌరులు, ఆస్తులు కూడా ప్రమాదంలో పడతాయని పేర్కొంది. పాకిస్తాన్ వాదనపై భారత వైమానిక దళం లేదా రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఎటువంటి స్పందన లేదు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి