News

కర్నూలులో సేవా భారతి సంచార వైద్యశాల ప్రారంభం

348views

క‌ర్నూలు: క్షయ వ్యాధి నిర్మూలన కొరకు అధునాతన పరికరాలతో త‌యారుచేసిన‌ సంచార వైద్య శాల కర్నూలు జిల్లాలో ప్రారంభ‌మైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస్‌) క్షేత్ర సేవ ప్రముఖ్ శ్రీ చంద్రశేఖర్ ప్రారంభించారు.

ఈ వాహనాన్ని ప్రారంభించడం కోసం డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి (సేవా భారతి కర్నూలు అధ్యక్షుడు) రెండేళ్ళుగా ఎంతో శ్ర‌మించారు. అశ్విని హాస్పిటల్స్ సౌజన్యంతో ఈ వాహనం ఏర్పాటు చేయడమైనది. ఇందులో కళ్లె పరీక్ష, రక్త పరీక్ష chest x ray  వెంటనే దాన్ని రిపోర్టు అందించడం, తగిన మందులు పంపిణీ వంటి సౌక‌ర్యాలు క‌ల్పించారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలించాల‌నే ముఖ్య ఉద్దేశంతో ఈ సంచార వైద్యశాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి