
లక్నో: ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో తీవ్ర ఆందోళనకు గురైన కేంద్ర ప్రభుత్వం.. అక్కడి భారతీయులను రక్షించుకోవాలని పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలతో స్వదేశానికి చేరారు. ఇంకా చేరుతున్నారు. నిజానికి ఈ పని భారత దేశానికి ఒక సవాల్. ప్రపంచంలో ఒకటి, రెండు మినహా తమ వారిని కాపాడుకోవడంలో మిగతా దేశాలు మిన్నకుండిపోయాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చొరవకు అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారు దేశంలోని నీతి లేని వాళ్ళు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని హర్దోహికి చెందిన సమాజ్‌వాది పార్టీ నాయకుడు మహేంద్ర యాదవ్ కుమార్తె వైశాలి తన ఇంట్లో నుంచే అంటే, భారతదేశంలో ఉండి తాను ఉక్రెయిన్‌లో చదువుతున్నానని, తనను భారత్ ఎంబసీ అసలు పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వంపై చిందులేసి, అప్రతిష్ఠపాలు చేయడానికి ఏకంగా ఒక వీడియో తయారుచేసి నెట్‌లో వైరల్ చేసింది.
అయితే, అందరూ ఆమెలా దేశద్రోహులు కాదు కదా… దేశభక్తులు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుందని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకేముంది… పోలీసులు తమ డ్యూటీ చేశారు. ఇప్పుడామె కటకటాలు లెక్కిస్తోంది.
కొసమెరుపు..
ఎందుకు చేశావు ఈ పని అంటే తండ్రి చేయమన్నాడని చెప్పిందట..
నీతి లేని తండ్రి… నీతి లేని కూతురు!





