
-
విద్యార్థి హర్‌జోత్ సింగ్‌ను రక్షించిన ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్
కైవ్: బహుశా మీరు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ట్రాన్స్‌పోర్టర్ సినిమా (మూడు సినిమాలు) చూసే ఉంటారు. కానీ ట్రాన్స్‌పోర్టర్‌కు తాతలాంటి నిజమైన సినిమా చూపించాడు.. ఉక్రెయిన్ రణరంగంలో ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్.
విషయంలోకి వెళితే… ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో భారతీయ విద్యార్థి హర్‌జోత్ సింగ్‌కు బుల్లెట్ గాయమైన సంగతి విదితమే. అయితే, అక్కడి పరిస్థితుల వల్ల సింగ్‌కు ప్రాధమిక చికిత్స మాత్రమే అందించగలిగారు. విద్యార్థికి ప్రాణాపాయం కలగకుండా ఉండాలంటే, కైవ్ పట్టణం నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడోమిర్జ్ బోర్డర్‌కు తరలించాలి. నిజానికి ఇది పెద్ద సాహసమే… ఎందుకంటే అది యుద్ధభూమి! ఎటు చూసినా బాంబు దాడులు, హాహాకారాలు.. గాలిలో ఎగురుతున్న మృతదేహాలు… అయినా లెక్కచేయలేదు… రంగంలోకి దూకాడు… సాహసికుడు, భరతమాత ముద్దుబిడ్డ అయిన ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్.
హర్‌జోత్ సింగ్‌ను తీసుకుని బోడమిర్జ్ బోర్డర్‌కు బయలు దేరాడు. దారిలో కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్‌లను అత్యంత చాకచక్యంగా తప్పించుకుని ముందుకు దూసుకుపోయాడు. దారిపొడవునా రోడ్లు బ్లాక్ చేయటం, పెట్రోల్ కొరత, వీటన్నింకంటే అత్యంత భయంకరమైన రాకెట్ దాడులనుండి తప్పించుకుని, మొత్తానికి హర్‌జోత్ సింగ్‌ను పోలెండ్‌కు చేర్చి, అతని ప్రాణాలు కాపాడాడు.
కైవ్‌ను విడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగా ఫిబ్రవరి 27న హర్జోత్ సింగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెస్ట్ ఎల్వివ్ నగరానికి క్యాబ్(టాక్సీ) ఎక్కాడు. ఈ క్రమంలో అతడికి నాలుగు బుల్లెట్లు తగిలాయి. కాగా, త్వరలో ఈ డ్రైవర్‌ను భారత ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. డ్రైవర్ పేరును భారత రాయబార కార్యాలయం వెల్లడించలేదు. శభాష్ డ్రైవర్!





