News

ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాది హతం!

603views

ఇస్లామాబాద్‌: 1999లో ఐసీ-814 ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల్లో ఒకరైన జహూర్ మిస్త్రీ అలియాస్ జాహిద్ అఖుంద్ పాకిస్థాన్‌లోని కరాచీలో హతమయ్యాడు. మార్చి 1న బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగుల దాడిలో జహూర్ మిస్త్రీ ఇంట్లోనే మరణించినట్టు పాక్ మీడియా చెబుతోంది.

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో జహూర్‌కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. వ్యాపారవేత్తగా నటిస్తూ పాకిస్థాన్‌లో అతడు దాక్కున్నాడు. ఇద్దరు దుండగులు మాస్క్‌లు ధరించి దాడి చేస్తున్న విజువల్స్ సీసీటీవీ కెమెరాలో ఉన్నప్పటికీ వారిని గుర్తించలేకపోయారు. బైక్‌పై వచ్చిన ఇద్దరూ ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి.. ఆపై దాడి చేసినట్టు తెలుస్తోంది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ దగ్గర కూడా ఈ దాడికి సంబంధించిన సమాచారం లేదని చెబుతున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి