News

ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం కేంద్రం రూట్ మ్యాప్‌

588views

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ నుంచి భారత ప్రజల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. రొమేనియా, హంగరీ మీదుగా ప్రజలను తరలించాలని భావిస్తోంది. ఈ తరలింపునకు భారత ప్రభుత్వం, హంగరీలోని భారత ఎంబసీ చర్యలు తీసుకుంటున్నాయి. సరిహద్దుకు సమీపంలో ఉండే భారతీయులకు తొలుత అవకాశం లభించనుంది. హంగరీ, రొమేనియా సరిహద్దుకు సమీపంలో ఉండేవారిని కూడా ముందుగా తీసుకురానున్నారు.

భారతీయులు ఎంఈఏతో సమన్వయం చేసుకోవాలని భారత ఎంబసీ సూచించింది. సహాయ చర్యల కోసం హంగరీ సరిహద్దు ప్రాంతానికి బృందాలను పంపించనుంది. చాప్‌-జహోని ప్రాంతానికి సహాయక బృందాలు వెళ్ళ‌నున్నాయి. అలాగే రొమేనియా సరిహద్దు పొరుబ్నే-సిరెట్‌ ప్రాంతానికి సైతం సహాయక బృందాలు వెళ్ళ‌నున్నాయి.

ఉక్రెయిన్‌లోని ఇండియన్‌ ఎంబసీ సూచనలు

  • విద్యార్థులు హంగేరి, రుమేనియా సరిహద్దులో ఉన్న చెక్‌పోస్ట్‌కి చేరుకోవాలి
  • ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలోని హుజూర్ద్‌, చెర్నీ వెస్ట్ ప్రాంతాలకు చేరుకోవాలి
  • స్థానిక విదేశాంగ శాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థులు టీమ్‌లుగా బయల్దేరాలి
  • బోర్డర్‌ వచ్చే సమయంలో విద్యార్థులు ప్రయాణించే వాహనాలపై భారత జెండాను ఉంచుకోవాలి
  • బోర్డర్‌ వచ్చే ముందు పాస్‌పోర్ట్‌, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను తెచ్చుకోవాలి
  • బోర్డర్‌ దాటే సమయంలో ఇబ్బందులు రాకుండా సరిహద్దుల వద్ద ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్ల ఏర్పాటు
  • రొమేనియా రాజధాని బుచరెస్ట్‌కి 2022 ఫిబ్రవరి 26న రెండు ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాలు
  • బుచరెస్ట్‌ నుంచి భారత పౌరులను ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు
  • పశ్చిమ ప్రాంతంలో ప్రస్తుతం విద్యార్థులు ఉన్న స్థావరాల దగ్గర ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి