
505views
శ్రీశైలం: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు శుక్రవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా ఫిబ్రవరి 22న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు జరుగనున్నాయి.
ఆలయం వద్దకు చేరుకున్న అదనపు ఈవో దంపతులకు శ్రీశైలం ఈవో శ్రీ ఎస్.లవన్న, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి తీర్థ, ప్రసాదాలు అందించారు.





