
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ భారత్ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించ గల శక్తి భారత్‌కు ఉందని, ఈ నేపథ్యంలో తమకు అండగా నిలవాలని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కోరారు. రష్యా-ఉక్రెయిన్ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్లిష్ట సయమంలో తమకు అండగా నిలవాలని భారత్‌ను ఉక్రెయిన్ కోరింది.
చాలా సందర్భాల్లో భారత్ శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించిందని, రష్యాతో భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని భావిస్తున్నట్టు పొలిఖా తెలిపారు. ఈ విషయంపై భారత ప్రధాని మోదీ పుతిన్‌తో మాట్లాడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. పుతిన్ ఎవరీ మాటా వింటారో తెలియదని, కానీ మోదీ మాట వినొచ్చునన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Source: Nijamtoday





