News

హింసను వెంటనే విడనాడాలి.. పుతిన్​ను కోరిన మోదీ

558views

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లో ఉద్రిక్త పరిస్థితుల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. హింసను వెంటనే విడనాడాలని పుతిన్​ను మోదీ కోరారు. ఈ మేర‌కు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

దౌత్యపరమైన చర్చలతోనే సమస్యకు పరిష్కారం వెతకాలని మోదీ సూచించినట్టు పేర్కొంది. ఇక ఉక్రెయిన్​కు సంబంధించి ఇటీవలి పరిణామాల గురించి పుతిన్​.. మోదీకి వివరించినట్టు తెలిపింది పీఎంఓ కార్యాలయం.

నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని పునరుద్ఘాటించారు మోదీ. ఉక్రెయిన్​లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేసినట్టు పీఎంఓ తెలిపింది. వారిని సురక్షితంగా భారత్​కు తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు పుతిన్​కు వివరించినట్టు పీఎంఓ వెల్లడించింది. తమ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాల అధికారులు, దౌత్య బృందాలు తరుచుగా సంప్రదింపులు జరిపేందుకు పీఎం మోదీ, ప్రెసిడెంట్​ పుతిన్​ అంగీకరించినట్టు పేర్కొంది.

భారత్​ కోరుకునేది అదే..

ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితి ఉన్నచోట భారత పౌరులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయాత్నాలు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. ఇరు దేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్​ కోరుకుంటోందని అన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి