News

రవిదాస్‌ దేవాలయంలో ప్రధాని మోదీ ప్రార్థనలు

623views

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురు రవిదాస్‌ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రార్థనలు చేశారు. అంతేకాదు ఆయన భక్తులతో మమైకమై ఆలయంలో ‘షాబాద్ కీర్తన’లో పాల్గొన్నారు. సందర్శకుల పుస్తకంలో కూడా గురు రవిదాస్‌ జీవితం అందరికీ మార్గదర్శకం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలతో పాటుగా వీడియోలను కూడా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ట్విట్టర్‌లో ….”రవిదాస్‌ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. సాధువు చూపిన మార్గాన్ని అనుసరించి సమానత్వం, సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మనమందరం సహకరిద్దాం” అని ట్వీట్‌ చేశారు.

అంతేకాదు ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా రవిదాస్ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సెలవు ప్రకటించింది. గురు రవిదాస్‌ 15 లేదా 16వ శతాబ్దపు భక్తి ఉద్యమకారుల్లో ఒకరు. అతని శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్‌లో ప్రముఖంగా ఉంటాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి