News

చైనా టెలికాం కంపెనీపై ఐటీ దాడులు

506views

గురుగ్రామ్: చైనా టెలికాం కంపెనీ హువావేపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా సోదాలు నిర్వహించింది. దిల్లీ, గురుగ్రామ్​ సహా కర్ణాటక బెంగళూరులోని కంపెనీ కార్యాలయాల్లో మంగళవారం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

కాగా, ఐటీ దాడులపై హువావే స్పందించింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం అందిందని తెలిపింది. భారత్​లో తమ కార్యకలాపాలు చట్టాలు, నియమాలకు లోబడే కొనసాగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ అంశంపై మరింత సమాచారం కోసం సంబంధిత ప్రభుత్వ విభాగాలను సంప్రదిస్తామని, అధికారులకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి