News

శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోండి..

691views

శ్రీ‌శైలం: చంటిపిల్లల తల్లులు శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోవాలని దేవ‌స్థానం అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంకోవైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు మొదలు పెట్టింది. తాజాగా ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొవిడ్ నియంత్రణ చర్యలపై ఆలయ ఈవో లవన్న దృష్టి పెట్టారు. దేవస్థానం పరిపాలన భవనంలో ఈవో ప్రత్యేక సమావేశమయ్యారు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి