News

20 చెత్త ఛానళ్ళ‌పై ఉక్కుపాదం!

663views
  • పాకిస్తాన్ కేంద్రంగా వ్య‌తిరేక‌ ప్ర‌సారాలు

  • భార‌త్‌లో నిషేధం

న్యూఢిల్లీ: భారత వ్యతిరేక ప్రచారం, నకిలీ వార్తలు ప్రసారం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా చేసుకుని ర‌న్ అవుతున్న 20 చెత్త యూట్యూబ్ ఛాన‌ళ్ళ‌ను కేంద్రం నిషేధించింది. ఈ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లు పాకిస్తాన్ కేంద్రంగా ప‌నిచేస్తున్న‌ట్టు గుర్తించారు. వీటిని త‌క్ష‌ణం మూసివేయాలని ఆదేశించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. నిఘా సంస్థలతో సమన్వయం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. భారత్‌కు చెందిన వివిధ సున్నిత అంశాలపై తప్పుడు వార్తలను వ్యాపింపజేస్తున్నాయని సమాచార, ప్రసార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

జమ్మూకశ్మీర్‌, భారత సైన్యం, రామమందిరం, మైనార్టీ వర్గాలు, త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌కు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని వెల్లడించింది. భారత్‌లో భయానక, సందేహాస్పద వాతావరణాన్ని సృష్టిస్తున్న ఆయా ఛానళ్లు, వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ హెచ్చరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి