
-
లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన
న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మృతిచెందిన సంఘటనపై నిన్న లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేస్తూ సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్టర్ ఎగిరిందని, 12.08 నిమిషాలకు ఆ హెలికాప్టర్‌తో ఏటీసీ సంబంధాలు తెగిపోయాయని తెలిపారు.
హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతిచెందినట్టు ఆయన తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారని, ఆయన్ను బ్రతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాదంలో మరణించినవారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు తెలిపారు. మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన వెల్లడించారు.
వెల్లింగ్టన్ కాలేజీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు అక్కడకు వెళ్లారన్నాని , అయితే, మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్‌ను స్థానికులు చూశారని, దాంట్లో ప్రాణాలను కొట్టుమిట్టాడుతున్నవారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినట్టు ఆయన తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన రక్షణ దళ సిబ్బంది పేర్లను రాజ్‌నాథ్ చదివి వినిపించారు.
కాగా, ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై కోయంబత్తూరు ఏటీసీ కీలక ప్రకటన చేసింది. హెలికాప్టర్ ప్రమాదానికి ముందు ఎలాంటి సంకేతాలు రాలేదని తెలిపింది. అత్యవసర సహాయం అవసరమైతే ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారని, ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంటే… పైలెట్ ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ద్వారా సాయం కోరుతారని ఏటీసీ వెల్లడించింది.
నాలుగు వేల అడుగుల తర్వాత ఏటీసీ నుంచి వెల్లింగ్టన్ బేస్‌కు ఛేంజ్ ఓవర్ అయ్యారని, ఆ తర్వాత ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. కోయంబత్తూరులో తక్కువ ఎత్తులో ప్రయాణించే… విమానాలు, చాపర్లను గుర్తించే రాడార్ వ్యవస్థ లేదని ఏటీసీ పేర్కొంది.
Source: Nijamtoday





